తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి,హైదరాబాద్ బ్రదర్స్ గా పేరుగాంచిన దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు ఆదివారం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు అనే విషయం మరిచిపొకముందే రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన సునీతాలక్ష్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్,కేఎల్ఆర్ ,సుధీర్ రెడ్డితో సహా ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి..ఈ క్రమంలో ఈ నలుగురు ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారు అని సమాచారం.చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ నుండి ఎంతమంది కారు ఎక్కుతారో..!
