పైకి ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ భాగోతం ఉందన్నది జగమెరిగి సత్యం. తాజాగా, ఈ విషయంపైనే టాలీవుడ్ బఢా ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా దీనిపై స్పందించారు. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడుతున్న వారిలో హీరోలు, రచయితలు, డైరెక్టర్లు కూడా ఉన్నారని చెప్పారు.
see also:అర్జున్‌రెడ్డిని తిరస్కరించిన జాహ్నవి..!
వాళ్ల క్రియేటివిటీ డ్రగ్స్ వాడినప్పుడు మాత్రమే బయటకు వస్తున్న తరుణంలో ఇది తప్పు అని చెప్పేందుకు లేకుండా పోతుందన్నారు. కథను రాసివ్వడానికి, ట్యూన్స్ కట్టడానికి డ్రగ్స్ తీసుకునే వారు చాలా మంది ఉన్నారన్నారు. డ్రగ్స్‌ను నియంత్రించడం కాని పని అని తేల్చి చెప్పారు. డ్రగ్స్‌పై ఒకే మాట మీద నిలబడే గ్రూప్ ఒకటి సినీ ఇండస్ట్రీలో ఉందని, ఏదేమైనా ఆ విషయాన్ని వ్యక్తిగతంగా చూడకుండా, సినీ ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించడం తగదన్నారు.