దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను భారీగా పెంచింది.అందులోభాగంగానేవరికి రూ.200 పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. 2018-19 సంవత్సరానికిగాను క్వింటాల్ కు ఈ ధర వర్తిస్తుంది.
see also:చావు బ్రతుకుల మధ్య ఎఎన్ఎం.దేవుడై అండగా నిలిచిన మంత్రి హరీష్ .
ప్రస్తుతం క్వింటా ధాన్యం రూ.1,550గా ఉంది. పెంచిన 200 రూపాయలతో.. క్వింటా మద్దతు ధర రూ.1750కి చేరింది.వరితోపాటు మరో 13 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచడానికి అంగీకరించింది కేంద్ర ప్రభుత్వం. కనీస మద్దతు ధరను ఉత్పత్తి ఖర్చుకు కనీసం ఒకటిన్నర రెట్లు చేస్తామని ఈ మధ్యే ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.