తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు బాటలో నడిచారు.
గతంలో నారా లోకేష్ నాయుడు భారతరాజ్యాంగ నిర్మాత భారతరత్న బీఆర్ అంబేద్కర్ వర్థంతి రోజు జయంతి
శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెల్సిందే .తాజాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా లోకేష్ బాటలో నడిచారు . బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి రోజు నాడు వర్థంతి నివాళులు చెప్పారు కానీ ఫోటోలలో వ్యక్తులను మార్చారు ఆయన .
అసలు విషయం ఏమిటి అంటే ఈ రోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ,దళిత తొలి ఉపప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి .అయితే ఉత్తమ్ తన అధికారక ఫేస్ బుక్ పేజీలో బాబు జగ్జీవన్ రామ్ కు వర్థంతి నాడు నివాళులు అర్పిస్తూ జనసంఘ్ నేత శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఫోటోను పెట్టి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.అది కాస్త నెటిజన్ల విమర్శలతో సెటైర్లతో వైరల్ అయింది.అయితే తప్పు అని తెలుసుకున్న ఉత్తమ్ ఆ పోస్టును డిలిట్ చేశారు ఆతర్వాత .