తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ హరీశ్ రావు ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగింది. కీలక అంశాలపై ఆయన కేంద్రమంత్రితో చర్చలు జరపడమే కాకుండా హామీ పొందారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటి అయిన మంత్రి హరీశ్ రావు పలు అంశాలపై హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నీటీ పారుదల ప్రాజెక్ట్ లకు సహకారం, జాతీయ
రహదారులకు నిధులు కేటాయించాలన్న అంశాలపై కేంద్ర మంత్రి తో చర్చించామన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భీమా, నీల్వాయి, ర్యాలి వాగు, మత్తడి వాగు, కొమరం భీం ప్రాజెక్ట్ లకు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని మంత్రి వెల్లడించారు. మూడు నెలల కాలానికి దాదాపు 50-60 కోట్లు రావాల్సి ఉందని తెలుపుగా…నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీ అధికారులను ఆదేశించారు.ఈ ఆర్థిక సంవత్సరం కేటాయింపులో రాష్ట్రంలోని 7
జాతీయ రహదారులను కేటాయించాలని కోరామని మంత్రి హరీశ్ రావు వివరించారు.
సిద్దిపేట-ఎల్కతుర్తి, జనగామా-దుద్దెడ, మెదక్-ఎల్లారెడ్డిగడి, పకీరాబాద్-బైంసా, సిరిసిల్ల-కామారెడ్డి, వలిగొండ-తొర్రుర్, నిర్మల్-ఖానాపూర్ ఆర్థిక ప్రణాళికలో చేర్చి, టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కోరామని ఆయన వివరించారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.