రాక.. రాక తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆరేళ్ల తరువాత వచ్చింది ఇలియానా. 2012లో దేవుడు చేసిన మనుషులు తరువాత ఇల్లీ బేబీ మళ్లీ తెలుగులో నటించలేదు. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ రవితేజ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి వచ్చేస్తోంది. శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది.
ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ నుంచి ఇలియానా వచ్చేసింది. అదేంటి అప్పుడే బయటకు ఎందుకొచ్చేసింది అనుకుంటున్నారా..? ఏం లేదు.. ఈ చిత్రంలో ఇలియానా తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసేసింది. నమ్మడానికి వింతగా అనిపించినా.. ఇదే నిజం. మొన్నటికి మొన్ననే సెట్‌లో అడుగుపెట్టినట్టు అనిపించినా అప్పుడే ఇలియినా అమర్ అక్బర్ ఆంటోని టీమ్‌తో కలిసి నెల రోజులైంది. షెడ్యూల్‌ను పూర్తి చేసి ఇండియాకు వచ్చేసింది ఇల్లీ బేబీ. ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.