ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో ఎంపీ షాకిచ్చారు.ఇప్పటికే తన డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల ఇరవై ఐదో తారిఖున టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తాను అని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అల్టీమేటం జారీచేసిన సంగతి తెల్సిందే.ఇది మరిచిపొకముందే మరో టీడీపీ ఎంపీ ఆయన బాటలో నడిచారు.నిన్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్రప్రభుత్వం మీద టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో టీడీపీ అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చిన సంగతి తెల్సిందే.
స్పీకర్ సుమీత్రా మహజన్ రేపు శుక్రవారం ఈ తీర్మానం మీద చర్చకు అనుమతిచ్చారు.ఈక్రమంలో రేపు జరగనున్న అవిశ్వాస తీర్మాన చర్చలో మాట్లాడాల్సిందిగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెప్పారు ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.దీంతో పార్టీలో సీనియర్ ,అనుభవం ఉన్న తనలాంటివార్ని కాదు అని యువకుడు ,ఇటీవల పార్టీలో చేరి ఎంపీ అయిన గల్లా జయదేవ్ కి ఇవ్వడంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
దీంతో పార్టీలో ఉన్న నేతలకు కనీస గౌరవం మర్యాద లేదని అతను తన సన్నిహితుల దగ్గర వాపోయాడు అంట. భవిష్యత్తు కార్యచరణ గురించి తన సన్నిహితులతో ,కొంతమంది ముఖ్యమైన అనుచరులతో రహస్య సమావేశం నిర్వహించారు అని వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే.. అయితే కొంతకాలంగా ఎంపీ కేశినేని నాని టీడీపీ వీడనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే.. అయితే తాజా రాజకీయ పరిణామాలతో కేశినేని నాని ఏనిర్ణయం తీసుకుంటారో అని సర్వత్రా అసక్తి నెలకొన్నది..