కొన్నేళ్లుగా బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతూ వరుస విజయవంతమైన చిత్రాలతో దూసుకుపోతోంది దీపికా పడుకొనే. మొదటి సినామానే.. షారూఖ్‌లాంటి స్టార్ హీరోతో చేయడంతో చాలా త్వరగా గుర్తింపు వచ్చింది. ఇలా దీపికా పడుకొనే తన స్టార్ ఇమేజ్‌ను నేషనల్ నుంచి.. ఇంటర్నేషనల్‌కు పెంచుకుంది.
ఇదిలా ఉండగా, ఈ హాట్ భామ దీపికా పదుకునేకు అరుదైన గౌరవం లభించింది. లండన్‌లోని ప్రతిష్టాత్మక మేడమ్స్ టు సాట్స్ మ్యూజియంలో దీపిక మైనపు బొమ్మ కొలువుదీరనుంది. టు సాట్స్ ప్రతినిధులు దీపికాను కలిసి ఆమె కొలతలు, ఫోటోలు తీసుకున్నారు. మైనపు బొమ్మను అందంగా తీర్చిదిద్దేందుకు 200 రకాల కొలతలు తీసుకున్నట్టు సమాచారం. టు సార్స్ట్ ప్రతినిధులు తనను కవడం గౌరవంగా భావిస్తున్నట్టు దీపిక తెలిపింది.