తెలుగు సినిమాకు సీజన్ లేదు. ప్రతీ శుక్రవారం సినిమా పండుగే. ఏదో ఒక క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. ఆగస్టు నెలలో కూడా ఇదే ఒరవడి కొనసాగనుంది. ఆగస్టులో థియేటర్లకు క్యూ కడుతున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏమిటో తెలుసా..?
ఆగస్టు నెల మొదటి శుక్రవారం నాడు బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల మధ్య బీభత్సమైన పోటీ నెలకొంది. ఏకంగా మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. కొత్త హీరో సుమన్ శైలేంద్ర బ్రాండ్ బాబుగా, సుశాంత్ చి.ల.సౌగా, అడవి శేషు గూఢాచారిగా వస్తున్నాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు హిట్‌లేని ఆశలన్నీ చి.ల.సౌపైనే. ఇప్పటికే రిలీజైన టీజర్‌తో కాస్త క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం మరో రెండు సినిమాలతో పోటీ పడుతూ లవ్ ఎంటర్‌టైన్‌తో వస్తోంది.
క్షణం సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అడవి శేషు హీరోగా నటిస్తున్న చిత్రం గూఢాచారి. ఈ చిత్రంలో బ్యూటీ క్వీన్ శోభిత వెండి తెరకు పరిచయం అయింది. అలాగే, అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి చిత్రంలో వెండి తెరకు పరిచయమైన సుప్రియ ముఖ్య పాత్రలో కనిపిస్తూ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆగస్టు 9న నితిన్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించిన శ్రీనివాస కళ్యాణం, 15న విజయ దేవరకొండ నటించిన గీత గోవిందం, 22న ఆది పినిశెట్టి నీవెవరో చిత్రం, 31న నాగచైతన్య శైలజారెడ్డి అల్లుడు చిత్రాలు విడుదల కానున్నాయి.