కాజల్ క్రేజీ స్టార్. ఈ మాటను ఎవరూ కాదనలేరు. అయితే, ఈ అమ్మడు చేతిలో ఒక్క స్టార్ హీరో కూడా లేడు. అసలు ఆఫర్సే రావడం లేదా..? అనుకుంటే ఓ పక్క నాలుగు సినిమాలు చేస్తుంది. తమిళచిత్రం తేరీ తెలుగు రీమేక్‌లో రవి తేజాతో జతకడుతోంది. వీరా, సారొచ్చారు వంటి చిత్రాల తరువాత రవి తేజాతో కాజల్ జత కట్టడం ఇది మూడో సారి. స్టార్ హీరోలు పట్టించుకోకపోయేసరికి యంగ్ హీరోలపాలిట కాజల్ పెద్ద హీరోయిన్ అయిపోయింది. బెల్లంకొండ శ్రీనివాస్ నటించే రెండు సినిమాల్లో కాజల్ హీరోయిన్ కాగా, గోపీచంద్ సరసన కూడా నటిస్తోంది. అంతకు ముందు గోపీచంద్ హీరోగా తెరకెక్కిన మొగుడు చిత్రంలో హీరోయిన్ కోసం కాజల్‌ను సంప్రదించగా.. కాల్షీట్స్ అడ్జెస్ట్ కాక.. చేయలేకపోయింది. దీంతో తాప్సీని తీసుకున్నారు.
స్టార్డమ్లేని హీరోలైనా కాజల్ ఏ మాత్రం తగ్గదు. ఇలా తగ్గకే గతంలో పెద్ద సినిమాలను సైతం వదలుకుంది. భారీ ప్రాజెక్టులో నటించి రెండు కోట్లు తీసుకున్న కాజల్ యంగ్ హీరోలతో నటిస్తున్నా రెమ్యునరేషన్ తగ్గించలేదట. డిమాండ్‌ను బట్టి కోటి నుంచి రూ.2 కోట్లు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఈ లెక్కన ఎక్కువ సినిమాలు.. ఎక్కువ రెమ్యునరేషన్‌తో ఇతర హీరోయిన్లకంటే ఎక్కువ సంపాదిస్తోంది కాజల్.