ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే టికెట్ల హాడావుడి మొదలైందా..రానున్న ఎన్నికల్లో సగమందికి టికెట్లు ఇవ్వను అని ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పాడా. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గర నుండి ఎంపీ వరకు..కింది స్థాయి నేత నుండి రాష్ట్ర స్థాయి నేత వరకు అందరూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏపీ ప్రజల ఆశాదీపం అయిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వైపు చూస్తున్నారా అంటే అవును అనే అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు..
గత సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుండి గెలుపోందిన టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాసరావు ఈసారి ఎన్నికల్లో భీమిలి నుండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే అక్కడ నుండి సిట్టీంగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి కూడా ఇక్కడ నుండే బరిలోకి దిగుతా అని తేల్చి చెప్పారు. అయితే ఇప్పటికే ఒక్కసారి తన ఆస్థాన మీడియా తప్పుడు ప్రచారం వలన తీవ్ర అసంతృప్తితో ఉన్న గంటాకు టికెట్ ఇవ్వను అని అంటే కాపు సామాజికవర్గ ఓట్లన్నీ చీలిపోతాయి.
ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమపై యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు గంటాను దూరం చేసుకునే బదులు ఎంపీకు టికెటివ్వను అని చెప్పడం బెటరని నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. దీంతో అవంతికి ఎంపీసీటుతో పాటుగా ఎమ్మెల్యే కూడా ఇవ్వను చెప్పకనే చెప్పారు అంట బాబు.దీంతో భీమిలి విషయంలో మంత్రి గంటాకు తనకు విభేదాలు రావడంతో రానున్న ఎన్నికల్లో టీడీపీలో ఉన్నా బాబు టికెటు ఇవ్వడు..ఒకవేళ ఇచ్చిన గంటా వర్గం ఓడిస్తారు..ఇలా పార్టీలో ఉండి నష్టపోయే బదులు వైసీపీలోకి వెళ్ళడం ఉత్తమమని అవంతి వైసీపీలోకి చేరాలని నిర్ణయించుకున్నారు అంట..