తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావడం లేదని ఇటీవల చాలా కామెంట్స్ పెరిగాయి. కానీ, టాలెంట్, అందం ఉంటే తెలుగు భామలకు అవకాశాలు ఇస్తామంటున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ కోవలోనూ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు తెలుగు భామలు ఇషా, శోభిత ధూళిపాళ్ల.
ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటున్న తెలుగు భాహ ఇషా. ఇప్పటికే ఎన్టీఆర్ వంటి పెద్ద హీరో సరసన రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడు మరిన్ని ఆఫర్లను తన సొంతం చేసుకుంటోంది. గత ఏడాది అమీ తుమీ, దర్శకుడు చిత్రంలో నటించింది ఇషా. ఈ ఏడాది అ అనే చిత్రంలో నటించి విజయం సాధించింది. అమీ తుమీ, అ చిత్రంతో తన టాలెంట్‌ను గుర్తించింది టాలీవుడ్. అందుకే, ఇప్పుడు వరుస ఆఫర్లను తన ఖాతాలో వేసుకుంటోంది ఇషా. ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేతతోపాటు నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఓ కొత్త చిత్రంలో ఈ భామ హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది.
తెలుగు అమ్మాయిలకు అస్సలు అవకాశాలు ఇవ్వడం లేదని ఇటీవల శ్రీరెడ్డి వంటి నటులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు తెలుగు అమ్మాయిలకు కూడా వరుస అవకాశాలు వస్తున్నాయని, ఇషా బిజీ కావడాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అలాగే, తాజాగా శోభిత ధూలిపాళ్ల అనే మరో తెలుగు అమ్మాయి కూడా తెలుగులో తన లక్‌ను పరీక్షించుకుంటోంది. గూఢాచారి అనే చిత్రంతో తాను టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. అయితే, శోభిత దూళిపాళ్ల పక్కా తెలుగు అమ్మాయి కావడం గమనార్హం.