ఒక అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడితే ఇంత బెదిరింపులా..? ఇంత ట్రోలింగ్‌లా..? నోరు విప్పి చెప్పలేవా పవన్ కళ్యాణ్..? ప‌్రజా నాయకుడివి అంటున్నావ్..? రేపటి రోజున ప్రజలకు ఏం చేస్తావ్..? ఒక ఆడది బయటకు వచ్చి మాట్లాడితే నీవేమి చేస్తావ్..? మహిళల సమస్యలు పట్టించుకోవా..? సమస్యకు పరిష్కారం చెప్పేటప్పుడు కొంచెమైనా బుర్రపెట్టి ఆలోచించి మాట్లాడు..! పవన్‌కు బుర్ర లేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారు.. ఆ విషయం నిజమేనని త్వరలో నిరూపణ అవుతుంది. రేపటి రోజున నీకు ఎవరైనా ఓటు వేస్తారా..? నీ మాట ఎవరైనా వింటారా..? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి శ్రీరెడ్డి మరోసారి ప్రశ్నల వర్షం కురిపించింది.
పవన్ కళ్యాణ్ మనిషిలా ఆలోచిస్తాడేమో అనుకున్నాం..కానీ పొరపాటైంది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ అది చాలక నటి పూనమ్ కౌర్‌తో సంబంధం పెట్టుకున్నారు. పవన్ కళ్యాన్, పూనమ్ విషయానికి సంబంధించి తన వద్ద పెన్ డ్రైవ్‌లు ఉన్నాయని చెప్పింది. ఆ పెన్ డ్రైవ్‌లను కూడా మహిళా సమస్యలపై తాను చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు వస్తున్నవారు ఇచ్చినవేనని, పవన్ కళ్యాణ్ వాడుకున్న అమ్మాయిల లిస్టు, ఫోటోలు, వీడియోలు, మెసేజ్‌లన్నీ ఉన్నాయని శ్రీరెడ్డి తెలిపింది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న శ్రీరెడ్డి ఈ వీడియోలను అతి త్వరలో బయటపెట్టనున్నట్టు చెప్పింది శ్రీరెడ్డి.