సాధారణంగా మనకు తెలియనిది ఏదైనా సమాచారం కావాలంటే ముందుగా ఇంటర్నెట్ ఓపెన్ చేసి గూగుల్ లో వెతికేస్తుంటాం. అలాంటి అతి పెద్ద గూగుల్ సంస్థ తమ వద్ద పనిచేసేందుకు మెరికల్లాంటి యువత కోసం ఇటీవల దేశవ్యాప్తంగా సెర్చ్ చేసింది. అంతేకాకుండా కృత్రిమ మేధ అంశమై చేస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో పనిచేయగల సత్తా ఉన్నవారిని ప్రత్యేకంగా గుర్తించేందుకు స్పెషల్ ఇంటర్వ్యూలు నిర్వహించింది.అందులో భాగంగానే..
తెలంగాణ అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది.రాష్ట్రంలోని వికారాబాద్ కి చెందిన కుడుగుంట స్నేహారెడ్డిని సోషల్ మీడియా దిగ్గజం గూగుల్ సంస్థ ప్రత్యేకంగా గుర్తించింది.ఈ సెర్చ్ లో భాగంగా మొత్తం
అత్యంత ప్రతిభావంతులైన ఐదుగురిని ఫైనల్లోకి ఎంపిక చేసింది. వీరికి ఒక్కొక్కరికి రూ.1.20 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగాలిచ్చింది. ఇంతటి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న ఐదుగురిలో మన తెలంగాణ అమ్మాయి కూడా ఉన్నారు. ఆమే.. వికారాబాద్ కు చెందిన కుడుగుంట స్నేహారెడ్డి. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ లో ఇటీవలే బీటెక్(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. చదువుతోపాటు అన్ని అంశాల్లో ట్యాలెంట్ కనబర్చి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని సైతం అందుకోవడం విశేషం.
స్నేహ రెడ్డి గురించి మీకు తెలియని విషయాలు..
ఇంటర్ లో 98.4 శాతం మార్కులతో ఉత్తీర్ణత
JEE 2014 మెయిన్స్ లో ఆలిండియా 15వ ర్యాంక్..
JEE అడ్వాన్స్ లో 677వ ర్యాంక్..