గులాబీ దళపతి,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.ఇవాళ టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ..వచ్చే నెల ( సెప్టెంబర్ ) 2న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం పరిధిలో ‘ప్రగతి నివేదన’ పేరిట టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ ఉంటుందని..రానున్న ఎన్నికలకు సెప్టెంబర్‌లోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని, ఎవరితో పొత్తు ఉండదని, ఒంటిరిగానే పోటీ చేస్తామని కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు . 9 నిర్ణయాలను ఏకగ్రీవంగా ఆమోదించాం. మేం తీసుకున్న నిర్ణయాలను ఆమోదించాలని కేంద్రాన్ని కోరతామన్నారు.
విభజన హామీలను నెరవేర్చాలని ఏకగ్రీవ తీర్మానం.
కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వనప్పటికీ రూ. 20 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతాం.
వరి, మొక్క ధాన్యాలకు మద్దతు ధర రూ. 2 వేల చొప్పున ఉండాలని కోరుతాం.
నరేగాను వ్యవసాయానికి అనుసంధానించాలి.
బీసీల సంక్షేమం కోసం మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి.
నీతి అయోగ్ వల్ల దేశానికి ఒరిగిందేమి లేదు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రూరల్, అర్బన్ సంక్షేమాలను రాష్ట్రాలకు వదిలేయాలి.
బీసీలు, మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి అని తీర్మానం చేసినట్లు చెప్పారు.