కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి మైనస్ అయిందా? పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్లలో ఆగ్రహం ఉందా? ఈ విషయం రాహుల్ టూర్ సందర్భంగా బట్టబయలు అయి పార్టీ పరువు గంగపాలు అయిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటు ఆయన వ్యవహారశైలి, అటు నాయకత్వానికి సహాయం వంటి వాటిల్లో ఉత్తమ్ ఫెయిలయ్యారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
రాహుల్ గాంధీ ఎంట్రీ సందర్భంగానే ఉత్తమ్ తీరుపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో రాహుల్ గాంధీ స్వాగతం తెలిపిన సందర్భంగా పీసీసీ సెక్యురిటికి ఇచ్చిన లిస్ట్ లో తన పేరు లేకపోవడంపై సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై అగ్రహాం వ్యక్తం చేశారు. పీసీసీ చీప్ వ్యవహారశైలి సరిగా లేదుని జైపాల్ రెడ్డి బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు రాహుల్ గాంధీ ప్రసంగం సందర్భంగా దానికి అనువాదం చేయడంలో ఆయన వైఫల్యం స్పష్టమైంది. ఏపీకి తగినట్లుగా తెలంగాణకు న్యాయం చేస్తామనే భావనపై ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందిస్తూ “మన పార్టీ అధ్యక్షుడు ఏమంటున్నారంటే…“కాంగ్రెస్ అధికారంలకు వస్తే…ఇగ తెలంగాణ పని అవుతుద్ది ..ఆంధ్రా పనిగూడా సరిగ్గనే ఐతది..” అంటూ చిత్రమైన అనువాదం చేశారు. దీంతో నవ్వులపాలు అవడం ఆయన వంతు అయింది.