తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు సామూహిక జీవిత భీమా పథకం రాష్ట్రంలోని రైతన్నల జీవితాలకు భరోసాను ఇస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.ఆరుగాలం కష్టపడి, అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు అనుకోని ప్రమాదం జరిగితే వారి కుటుంబాలకు ఆసరాగా రైతుభీమా పథకం ఆదుకుంటుందని,అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయానా రైతు బిడ్డ కావడం వల్ల,రుణ మాఫీ,రైతు బంధు పట్టా పాసు బుక్కులు, మరియు ఎన్నో సంక్షేమ పథకాలు రైతుల ను దృష్టిలో పెట్టుకొని 24 గంటల ఉచిత కరెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
భీమా పొందని రైతులు ఆధార్ కార్డ్ , మరియు పాసు పుస్తకము జిరాక్స్ వ్యవసాయ శాఖ అధికారులకు అందించి, భీమా పొందాలని కోరారు.ఆగస్ట్ 15 నుండి రైతు భీమా పథకం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో, గుంట నుండి ఎకరాల్లో భూములు ఉన్న రైతులు భీమా సదుపాయాన్ని పొందాలని పిలుపునిచ్చారు.ఈ రోజు మడికొండ లో రైతులకు రైతు భీమా బాండ్లను అందించారు…మేయర్ నన్నపనేని నరేందర్ గారు, రైతు సమన్వయ సమితి కో ఆర్డినటర్ రాధిక రెడ్డి,కార్పొరేటర్ జోరిక రమేష్,తెరాస నాయకులు ఇండ్ల నాగేశ్వర్ రావు, డివిజన్ అధ్యక్షులు నర్సింగా రావు,బైరి కొమురయ్య,దేవస్థానం ఛైర్మెన్ అల్లం శ్రీనివాస్,మరియు రైతులు కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు ..