తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ, పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం సంయుక్త సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు కానున్నారు. అయితే నిన్న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు .ఎన్నికలు ఎప్పుడు జరిగిన సిద్ధమేనని..ఒంటరిగానే 100 సీట్లు గెలుసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు . అయితే సెప్టెంబర్ లోనే ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లు ప్రకటిస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలోనే ఈనెల 17న జరుగనున్న ఈ సమావేశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
