భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్ల ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఆ మొత్తం రూపాయల చెక్కును రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కొద్ది సేపటి క్రితం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిశి అందజేశారు.అంతేకాకుండా తన నెల జీతాన్ని కూడా కేరళ సీఎం సహాయ నిధికి అందజేసినట్లు ఆయన తెలిపారు.వరదలతో కలుషిత నీటి సమస్య నివారించేందుకు తన శక్తిమేరకు రూ. 2.5 కోట్ల విలువైన ఆర్వో మిషన్లను పంపుతున్నది. మరోవైపు పసిబిడ్డల ఆకలి తీర్చేందుకు వంద టన్నుల బాలామృతాన్ని కేరళకు చేరవేసింది.
