గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా..గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం కుదేలు అయింది.వర్షాలు, వరదల వల్ల కేరళలో మృతుల సంఖ్య ఇప్పటివరకు400 కు చేరింది.ఈ క్రమమలోనే కేరళ రాష్ట్రానికి అండగా..వివిధ రాష్ట్రాలు,సినీ ప్రముఖులు వారికి తోచినంతగా సహాయం చేస్తున్నారు.ఇప్పటికే మెగా ఫ్యామిలీలోని మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ రూ. 25 లక్షల సాయం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. హీరో అల్లు అర్జున్ రూ.25 లక్షలు ,హీరో విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు విరాళంగా ఇస్తునట్లు ప్రకటించారు.అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ విరాళాన్ని ప్రకటించారు. బాధితులకు చేయూతనందించేందుకు కేరళ సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు అందిస్తానని చెప్పారు.
