ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తాజాగా చంద్రబాబు రాజకీయ పెళ్లిళ్లగురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై సోమిరెడ్డి మాట్లాడారు. “ప్రతిపక్షనేతకు ఈ మధ్య పెళ్లిళ్ల యావ ఎక్కువయ్యిందని నోరు జారారు.. అసలు వైఎస్ జగన్ ఎవరిని ప్రేమించి, ఎవరిని పెళ్లిచేసుకుని, ఎవరితో కాపురం చేస్తారో తెలియజేయాలన్నారు”. జగన్ రాజకీయంగా మాట్లాడిన పెళ్లిళ్ల అంశంపై సోమిరెడ్డి మాట్లాడుతూ టిడిపిపై జగన్ ఇష్టానుసారంగా మాట్లాడారని, వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయమనే భయంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతంలో జగన్‌తో ప్రధాని మోడీ ఏం మాట్లాడారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాకూదని తాము కోరుకుంటున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. తమ నాయకుడు టీడీపీ రాజకీయ పెళ్లిళ్ల గురించి మాట్లాడితే సోమిరెడ్డి వ్యక్తిగతంగా ఎటువంటి మచ్చలేని జగన్ గురించి మాట్లాడడం దారుణమని, నాలుగుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డి సోది చెప్తున్నాడంటున్నారు. సోదిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు.
