Home / ANDHRAPRADESH / అలా జరిగితే టీడీపీ కార్యకర్తలే తరిమి కొడతారా.? సీనియర్లు ఎందుకు సీరియస్ అవుతున్నారు.?

అలా జరిగితే టీడీపీ కార్యకర్తలే తరిమి కొడతారా.? సీనియర్లు ఎందుకు సీరియస్ అవుతున్నారు.?

మరోసారి చంద్రబాబునాయుడి రాజకీయ చాణక్యం స్పష్టంగా అర్ధమవుతోంది. చంద్రబాబు గోల్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అందుకోసం కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలని.. అలా వెళ్లి ఆ ప్రయోజనం తాను పొందాలని.. కాంగ్రెస్ తో కలిసి వెళ్లటం వల్ల అటు తెలంగాణలో టీఆర్ ఎస్ ను ఎదుర్కోవడంతోపాటు.. ఇటు ఏపీలో బీజేపీని దెబ్బ తీయెచ్చనే భావన.. దీనికోసం చంద్రబాబు చాలా పెద్ద స్కెచ్ వేసారు.. ఏపీలో బీజేపీ అన్యాయం చేసిందని, మళ్లీ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి వెళ్తే మంచిదని తన అనయూయలచేత ప్రచారం చేయిస్తున్నారు. పైగా “వైసీపీ, జనసేనలకు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనని గత కొద్దినెలలుగా ప్రచారం చేస్తున్నారు.” అసలు అది ఎలా అవుతుందో ఎవ్వరికీ అర్ధం కావట్లేదు.. అంటే ప్రత్యేకహోదా ఇవ్వని బీజేపీపై ఉన్న కోపాన్ని వైసీపీ, జనసేనలపై చూపించాలని చంద్రబాబు కోరుతున్నారు. అయితే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఆపార్టీ తమను మోసం చేసిందనే భావనలోనే 2014లో ఏపీ ప్రజలు కాంగ్రెస్ ను మట్టికరిపించారు. ప్రస్తుతం చంద్రబాబు కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకోవడంపై పంపిస్తున్న సంకేతాలు టీడీపీలో ముసలం పుట్టిస్తున్నాయి. దీనిపై టీడీపీ సీనియర్‌ నేతల్లో నిరసన స్వరం బాహాటంగానే వినిపిస్తుంది. ఏపార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందో అదే పార్టీతో పొత్తుపెట్టుకోవడం.. వచ్చే ఎన్నికల్లో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఓట్లు అడిగితే రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి సర్వ నాశనం చేసిన పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు క్షమించబోరని టీడీపీ సీనియర్‌ నేతలు మండిపడుతున్నారు. వచ్చేఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లలేమని, ప్రజలు తరిమితరిమి కొడతారని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తిలు ఈ వ్యవహారంపై చాలా ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని, గుడ్డలూడదీసి తంతారని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించగా, కాంగ్రెస్‌ దరిద్రం తమకు వద్దని ఉప ముఖ్యమంత్రి కేఈ పేర్కొన్నారు.
2019లో టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడం వంటి తప్పుడు నిర్ణయం చంద్రబాబు తీసుకుంటారని తాను అనుకోవట్లేదన్నారు. అలా జరిగితే వ్యతిరేకించే మొదట వ్యక్తిని తానేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఉండకూడదనే భావనతో ఎన్టీఆర్‌ పగలనక, రాత్రనక కష్టపడి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. అటువంటి పార్టీతో కలిస్తే అంతకుమించిన దుర్మార్గం మరొకటి ఉండదు. కాంగ్రెస్‌తో కలిసే పరిస్థితి వస్తే తమలాంటి వాళ్లం ఉండలేమని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సైతం కాంగ్రెస్‌తో పొత్తుపై మాట్లాడుతూ నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ పార్టీ, జగన్‌, పవన్ వీళ్లంతా తమకు శత్రువులేనన్నారు. మరోవైసు కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులు కుదుర్చుకోవాలన్న పార్టీ అధినేత చంద్రబాబు వైఖరిపై తెలుగుదేశం శ్రేణుల్లోనూ తీవ్రంగా చర్చ సాగుతోంది. కాంగ్రెస్‌ అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలను, రాష్ట్ర నేతలపట్ల అవమానకరమైన రీతిలో వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదంతో టీడీపీని స్థాపించారని, ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని వెళ్లాలన్న ఆలోచన చేయడం ద్వారా చంద్రబాబు రాష్ట్రప్రజల ఆత్మగౌరవాన్ని మరోసారి కాంగ్రెస్‌ పార్టీకి తాకట్టుపెట్టేందుకు సిద్ధమవుతుండడంతో వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో ఓటుకుకోట్లు కేసు కారణంగా పార్టీని పణంగా పెట్టి కేంద్రానికి సాగిలపడడంపై టీడీపీ శ్రేణుల్లో అంతర్గతంగా చర్చ సాగుతోంది. ప్రత్యేక హోదాను వదులుకోవడమేగాక రాష్ట్ర విభజన చట్టంలోని అనేక హామీలు అమలుకాకున్నా నోరెత్తలేని పరిస్థితికి తెలుగుదేశాన్ని దిగజార్చారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. తెలంగాణలో పార్టీని భూస్థాపితం చేశారని, అక్కడ కాంగ్రెస్‌ పార్టీతో మిలాఖత్‌ అవుతూ ఏపీలోనూ ఆ పార్టీతో పొత్తులకు పార్టీ అధినేత ముందుకు కదులుతుండడాన్ని అసలైన తెలుగుదేశం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
మరోవైపు టీడీపీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు రంగం సిద్దం అవుతోదనే వరుస పరిణామాలతో అర్ధమవుతోంది. గతంలో ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానించారు. ఏపీకి హోదాపై తీర్మానం చేయటంతోపాటు ఇతర రాష్ట్రాల వాళ్ళు దీన్ని వ్యతిరేకించవద్దని రాహుల్ ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా బిజెపిపై ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఏపీ ప్రజలు ఆగ్రాహానికి గురయ్యేలా చంద్రబాబు రాజకీయం చేసి ఈ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ రంగంలోకి దింపారు. అందుకే సీడబ్ల్యూసీలో తీర్మానం పెట్టి రాజకీయ పొత్తులకు లైన్ క్లియర్ చేసినట్లు కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ, కాంగ్రెస్ లు ఏపీ, తెలంగాణల్లో పొత్తు పెట్టుకోవటం ఖాయం అని ఎప్పటి నుంచో ఢిల్లీలోనూ ప్రచారం జరుగుతోంది. దీనికి బలమైన కారణం ప్రత్యేక హోదా.. ఈహోదా ఇస్తామని బిజెపి మోసం చేసింది కాబట్టే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నాం అని చంద్రబాబు చెప్పుకుంటారు. చంద్రబాబు చెప్పుకోవడం ఎలా ఉన్న జనం చెప్పులతో కొడతారని, కనీసం జిల్లాలవారీగా రెండు మూడు సీట్లకు కూడా టీడీపీ పరిమితమైపోయినా ఆశ్చర్యం లేదని తెలుగుదేశం కీలకనేతలే చెప్పుకొస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat