గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు మిత్ర విధానాల్ని ప్రారంభించాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల్నిఅనుసరిస్తుందని
ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి అన్నారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ది హరిత విప్లవం, క్షీర విప్లవాలైతే బీజేపీ ది అవినీతి విప్లవమని దుమెత్తిపోసారు. 2004 నుంచి 2014 వరకు జల యజ్ఞం క్రింద 14 ప్రాజెక్టుల్ని ప్రారంభించినా…. ప్రస్తుతం వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని,రైతాంగం అప్పుల్ని ఎదుర్కొంటుందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ అంతంత మాత్రంగానే ఉందన్నారు. వ్యవసాయ రుణాలు తీసుకుని ఎక్కువ వడ్డీలను చెల్లించవలసివస్తోందని, టీడీపీ ప్రభుత్వ రుణమాఫీ పదకం రైతులకు శాపం గా మారిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగంతో అనుసంధానం చేస్తామన్నారు.రైతుల కష్టాలు రాకుండా చేస్తామని ఆయన అన్నారు.
