రానున్న ఎన్నికలలో ఏ పార్టీకి ఏ విధంగా ఉంటుందన్నదానిపై పలు రకాల సర్వేలూ, వార్తాలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. వాస్తవానికి ఏ ప్రభుత్వం మీదనైనా యాంటీ ఇంకెబెన్సీ చివరి ఏడాదిలో తెలుస్తుంది. ఏపీ వరకూ చూస్తే అటువంటి వాతావరణం ఉందా అనిపిస్తోంది. ఎక్కడ చూసినా బాబుకు బాగానే ఉందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు అనుకూల మీడియానే. ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కడా కనిపించకుండా అనుకూల మీడియా చంద్రబాబు భజన చేస్తోంది. మీడియా సపోర్ట్ ఉండడంతో చంద్రబాబు సభలు, పర్యటనలను ఒక మంచి కోణంలో చూపిస్తుంది.
ఈమీడియా ప్రభావం పట్టన ఓటర్లపైన ఎక్కువగా ఉంటుంది అనేది ఒకప్పటివార్త.. పట్టణాల్లో చదువుకున్నవారు అధికంగా ఉండడంతో పాటు, మీడియా వార్తలను బాగా ఫాలో అయ్యేది వీరే కాబట్టి పట్టణాలలో బాబుకు అంతా బాగుందన్న మాట గట్టిగా వినిపిస్తోంది. కానీ ఇదంతా ఒకప్పటిమాట.. ఈరోజుల్లో పట్టణవాసులు మీడియాకంటే సోషల్ మీడియానే ఎక్కవగా నమ్ముతున్నారు. కాబట్టి గతంలో మాదిరిగా మీడియాను మేనేజ్ చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలనుకోవడం భ్రమే అవుతుంది.
అయితే ఇక పల్లెలోకి వస్తే చదువుకున్న వారి కంటే వీరే ఏవిషయాలైనా బాగా అర్దంచేసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ లోపాలపై నిత్యం విశ్లేషణ జరుగుతుంది. రుణమాఫీ, డ్వాక్రా మహిళల హామీలు తీర్చకపోవడం, నిరుద్యోగ సమస్యల నేపధ్యంలో వీరంతా ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.పైగా ఇక్కడ జన్మభూమి కమిటీలు జనాలపై నెగిటివ్ ప్రభావాన్నిచుపిస్తున్నాయి. దాంతో రూరల్ ప్రాంతాల్లో జనం టీడీనీకి బాగా దూరమయ్యారు. మరోవైపు జగన్ పాదయాత్ర కూడా పల్లెలపై మంచి ప్రభావం చూపిస్తుంది. గతంలో నందమూరి తారకరామారావుకు పల్లెప్రజలు నీరాజనం పడితే కాంగ్రెస్ కి పట్టణాలు అండగా ఉండేవి. అలాగే 2014లో రాష్ట్రం నలుమూలల రూరల్ ప్రాంతాలు జై జగన్ అంటే పట్టణాల్లో చంద్రబాబు గాలి వీచింది. 2019లో మాత్రం పట్టణ ఓటర్లు సైతం జగన్ కు జై కొడుతున్నారు. ముఖ్యంగా మీడియా అతి, జన్మభూమి కమిటీలు జనాలను వేధిస్తున్నాయనటంలో ఆశ్చర్యం లేదు.