Home / 18+ / బ్రేకింగ్:డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలు..11న కౌంటింగ్

బ్రేకింగ్:డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలు..11న కౌంటింగ్

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌పై సస్పెన్స్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. తెలంగాణలో ఓటర్ల జాబితాను ప్రకటించడానికి ఇంకా సమయం ఉందని, ఈ నెల 8న ఓటర్ల తుది జాబితాను ప్రకటించాలని భావించినప్పటికీ.. ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశముందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్‌ స్పష్టం చేశారు. ఈ నెల 12వ తేదీలోగా ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసేందుకు కొంత సమయం పట్టవచ్చునని ఆయన చెప్పారు.

119 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల చివరి తేదీ నవంబర్ 19. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 22.