Home / NATIONAL / మంత్రి కేటీఆర్‌తో సంజయ్‌బారు చమత్కారం..!

మంత్రి కేటీఆర్‌తో సంజయ్‌బారు చమత్కారం..!

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ సలహాదారు సంజయ్‌బారు చమత్కారం చేశారు. మంత్రి కేటీఆర్‌కు సీనియర్‌ సిటిజన్‌ ఫ్యాన్స్‌ పెరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న ప్ర‌శంస‌తో కూడిన చ‌మ‌త్కారం చేశారు.వివరాల్లోకి వెళితే…ఓ సీనియర్‌ సిటిజన్‌ రోడడు పక్కన ఇబ్బందులు పడుతుంటే…మంత్రి కేటీఆర్‌ ఆయనకు ప్రభుత్వ అధికారుల సహాయంతో నీడ కల్పించారు.

ఈ అంశం ఓ పత్రికలో కథనంలో రూపంలో రాగా…ఆ పెద్దాయనకు నీడ దొరకడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సంజయ్‌బారు ‘మీకు సీనియర్‌ సిటిజన్‌ ఫ్యాన్స్‌ పెరుగుతున్నారు’ అంటూ చమత్కార పోస్ట్‌ పెట్టారు. దీనికి మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar