కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దేశవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రత్యేక విమానంలో నేడు వివిధ రాష్ర్టాల పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. అయితే గులాబీ దళపతి మాటకు లోక్‌సత్తా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ జైకొట్టారు.
ఫెడరల్ వ్యవస్ధతోనే దేశాభివృద్ది సాధ్యమన్నారు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ. చాలా అధికారాలు కేంద్రం దగ్గర ఉండటంతో దేశం అభివృద్ది చెందడం లేదన్నారు. శనివారం కరీంనగర్ ఫిలింభవన్ లో నిర్వహించిన రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి – రాజ్యాంగ అడ్డంకుల అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల సపోర్ట్ లేకుండా ఏ కూటమి మనుగడ సాధించలేదన్నారు. విద్య, వైద్యం లాంటి అంశాల్లో రాష్ట్రాలకు అధికారాలను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
Post Views: 256