తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటన కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. గురి చూసి లక్ష్యాన్ని టార్గెట్ చేసి విజయం సాధించడంలో తన ముద్రను చాటుకున్న ఎంపీ కవిత చేసిన ట్వీట్ ఇప్పుడు కాంగ్రెస్ నేతలను షేక్ చేస్తోందని అంటున్నారు. ఇకపై మంథని నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించనున్నట్టు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కేసీఆర్ అభిమాని ఒకరు చేసిన ట్వీట్‌కు ఆమె ఈ విధంగా స్పందించారు.
2014లో టీఆర్‌ఎస్ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత ఎంపీ కవిత జగిత్యాల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి నిలిపారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పకడ్బందీ కార్యాచరణతో విజయం సాధించారు. ఫలితంగా తాజా ఎన్నికల్లో జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిని ఓడించి నియోజకవర్గంపై టీఆర్‌ఎస్ జెండా ఎగురవేశారు. ఈ నేపథ్యంలో.. మీ తదుపరి లక్ష్యం ఏ నియోజకవర్గం అంటూ ఓ అభిమాని ట్విట్టర్‌లో ప్రశ్నించగా.. మంథని అని కవిత సమాధానమిచ్చారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నుంచి కాంగ్రెస్ నేత శ్రీధర్‌బాబు గెలిచారు. అలాంటి సీనియర్ నేత నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి అక్కడ టీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నిర్దేశించుకోవడం….కవిత టార్గెట్ ద్వారా అక్కడ రాజకీయాలు హీటెక్కనున్నాయని అంటున్నారు .
Post Views: 274