క్రిస్మస్ రోజున కొణిదెల వారి కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ, కల్యాణ్‌దేవ్ దంపతులకు పండంటి ఆడశిశువు జన్మించింది. ఈ విషయాన్ని కల్యాణ్‌దేవ్ సోషల్‌మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. పాప కాలి ముద్ర ఉన్న ఫొటోను కల్యాణ్ దేవ్ షేర్ చేశారు. ‘2018 క్రిస్మస్ నా జీవితాంతం గుర్తుండి పోతుంది. మాకు ఇవాళ ఉదయం ఆడశిశువు పుట్టింది. మీ అందరికీ సూపర్ మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు’ అని ఆయన పోస్ట్ చేశారు.దీనితో చిరు కుటుంబంలో సంబర వాతావరణం కనిపిస్తుంది.
కల్యాణ్‌దేవ్ ప్రస్తుతం తన రెండో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన ‘విజేత’ చిత్రంతో ఈ ఏడాది నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాతో అతడు మంచి పేరు అందుకుంది. ఇందులో కల్యాణ్ దేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీని తర్వాత ఆయన పులి వాసు దర్శకత్వంలో నటిస్తున్నారు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.