తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే. దీంతో ప్రస్తుతం ఆ పార్టీకి పీసీసీ చీఫ్ గా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ పదవి పై చర్చ మొదలైంది.
బీసీ నేతను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం కూడా అధ్యక్షుడిని మార్చాలని యోచిస్తోందట. కానీ ఈ మార్పు ఇప్పట్లో ఉండకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎందుకంటే మరో 6 నెలల్లో లోక్ సభ ఎన్నికలున్న నేపథ్యంలో అప్పటివరకు తాజా పీసీసీ చీఫ్.. ముఖ్యమంత్రిగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డి నే పీసీసీ చీఫ్ కొనసాగించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.