దేశంలో ఉన్న మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులివ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రుతుస్రావం అనేది ఛాయిస్ కాదు. అది ఒక బయాలజికల్ రియాలిటీ. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం చాలా మంది మహిళలు అనుభవించే నిజమైన బాధను విస్మరించినట్లే. మహిళలు ఎదుర్కొనే సమస్యల పట్ల సానుభూతి లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది’ అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.