తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళ సై ప్రసంగించిన ప్రసంగం గురించి ధన్యవాద తీర్మానం సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ గవర్నర్ ప్రసంగం గురించి మాట్లాడుతూ” గవర్నర్ తమిళ సై ప్రసంగం అంత అసత్యాలు.. తప్పులే అని విమర్శించారు. గవర్నర్ ప్రసంగం విని సభ్యుడిగా సిగ్గుపడుతున్నాను.
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగుతాగు నీటికి దిక్కులేదు. విద్యుత్ లేక పంటలు ఎండిపోయాయి. ఎక్కడ చూసిన రైతన్న గీతన్న నేతన్నల ఆత్మహత్యలు . ఆకలికేకలు ఉండేవి.