టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ రాజధాని జయపురలోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుకను నిర్వహించారు. ఆదివారం రాత్రి వరుడు కార్తికేయ, వధువు పూజా ప్రసాద్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేడుకకు రెండు రోజుల ముందే ప్రముఖులు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఉపాసన, అనుష్క, ఎంఎం కీరవాణి, జగపతిబాబు, రానా తదితరులు హాజరయ్యారు. ముందస్తు పెళ్లి వేడుక నుంచి చివరి ఘట్టం వరకు తారక్, ప్రభాస్, చరణ్, రానా రాజమౌళి కుటుంబీకులతో కలిసి రచ్చ చేశారు. డ్యాన్సులతో సందడి చేశారు. కాగా..రాత్రి జరిగిన పెళ్లి వేడుకలో పెళ్లి కుమార్తె కూర్చున్న పల్లకిని ఆమె బంధువులతో పాటు ప్రభాస్ కూడా మోశారు. ప్రభాస్ పల్లకి మోస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. వేడుకలో ప్రభాస్, అనుష్క సందడి చేస్తున్న వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.
Darling #Prabhas at #SSKWedding #PrabhasAtSSKWedding pic.twitter.com/VIYEiNcLYl
— Prabhas (@Prabhas_Team) December 30, 2018
For the nth time.
My #Pranushka heart is crying seeing them looking just sooo perfectly married couple material ?❤️?❤️?
Dear god, please? 🙂#Prabhas #AnushkaShetty #SSKarthikeyaWedding pic.twitter.com/RUAeaFZvQ0— ?????? ۵ (@_anushax_) December 31, 2018