కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. అధిష్టానం ఆదేశాల మేరకు సర్వేను క్రమశిక్షణా కమిటీ సస్పెండ్ చేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌పై సర్వే వాటర్ బాటిల్ విసిరారు. ఈ ఘటనను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గాంధీభవన్‌లో రెండోరోజు టీపీసీసీ సమీక్షలు నిర్వహించింది. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్ష సమీక్షా సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జీ కుంతియా, టీపీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సర్వే అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఉత్తమ్, కుంతియాపై సర్వే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్వేను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ అడ్డుకున్నారు. సత్యనారాయణ, కిషన్ పరస్పరం దూషించుకున్నారు. బొల్లు కిషన్‌పైకి సర్వే వాటర్ బాటిల్ విసిరారు. సమావేశం మధ్యలోనే అలిగి ఆయన వెళ్లిపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీలో రౌడీ మూకలున్నాయని, పార్టీలో ఏం జరుగుతోందో సోమవారం చెప్తానన్నారు. ఉత్తమ్ అర్హత లేనివాళ్లకు పదవులిచ్చారని, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌ను తొలగించాల్సిందేని డిమాండ్ చేశారు. ఉత్తమ్‌ను ఇంకా పార్టీ భరించాలా? పార్టీకి నష్టం చేసినవాళ్లే మళ్లీ రివ్యూలు చేస్తే ఎలా అని సర్వే సత్యనారాయణ ప్రశ్నించారు.