తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుగొండ లక్ష్మినరసింహస్వామి జాతరకు జనం పోటెత్తుతున్నారు. ప్రతి ఏడాది జనవరిలో వచ్చే పౌర్ణమిలో ఈ జాతరకు వరంగల్ జిల్లాలోని భక్తులే కాకుండా పొరుగున ఉన్న ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ నుంచి సైతం భక్తులు విచ్చేస్తున్నారు.
సమ్మక్క జాతరకు వెళ్లే వారు లక్ష్మీనరసింహుడిని దర్శించుకునే ఆనవాయితి ఉన్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరింంచి ఉన్న ఆలయ గుట్ట 300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకప్పుడు గుట్ట ఎక్కి దేవుడిని చేరుకోవడం ఇబ్బందిగా ఉండగా ఇప్పుడు మెట్లు, గుట్ట వద్దకు చేరుకునేందుకు దారి ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
గుట్ట సమీపంలో పాటిగడ్డ ప్రాంతంలో శాతవాహనకాలం నాటి ప్రజలు ఉపయోగించిన పనిముట్లు ఎన్నో బయటపడ్డాయి. ఈ ప్రాచీన ఆనవాళ్లపై పార్లమెంటులో కూడా చర్చ జరగడం విశేషం.
ఆధునిక నాగరికతను ఇక్కడ బీజం పడిందని, వరంగల్ మహానగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుట్టను మరింత అభివృద్ధి చెందిస్తే..ఇటు ఆధ్యాత్మికంగ అటు పర్యాటకం పరంగా కూడా పెద్ద ఎత్తు భక్తులు, సందర్శకులు వస్తారని పలువురు పేర్కొంటున్నారు.
Post Views: 402