ఈ నెల 14వ తేదీన జరగనున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశం వాయిదా పడింది. ఏపీలోని తాడేపల్లిలో వైఎస్ జగన్ నూతనంగా ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ నెల 14వ తేదీన జగన్ నూతన ఇంటిలోకి గృహప్రవేశం చేయాల్సి ఉంది. అయితే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు అందరూ హాజరుకావాల్సిందిగా జగన్ ఆహ్వానాలు కూడా పంపించారు. అయితే, ఇప్పుడు ఈ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. జగన్ సోదరి వైఎస్ షర్మిల, బావ అనీల్ అనారోగ్యంతో ఉండటంతో గృహప్రవేశ కార్యక్రమాన్ని జగన్ వాయిదా వేశారు. త్వరలోనే కొత్త గృహప్రవేశ తేదీని ప్రకటించనున్నారు.
