ఫిబ్రవరి 25 సోమవారం.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ అరాచక శక్తులు పేట్రేగిపోయాయి. ప్రకాశం జిల్లా వైసీపీ కార్యాలయ ప్రాంభోత్సవాన్ని టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసుకుంటే మీకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించగా టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. వెంటనే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. బాలినేనిని అక్కడినుంచి తరలించారు. అలాగే వైయస్‌ఆర్ (కడప) జిల్లాలో టీడీపీ నేతలు అరాచకం హద్దులు దాటిపోయింది.
వైసీపీ నేత అల్లం సత్యం కారును తగలబెట్టారు.. కొండాపురం మండలం ఏటూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ దారుణం జరిగింది. కొన్ని గ్రామాల్లో వైయస్‌ఆర్‌సీపీకి చెందినవారిని బూత్‌ల్లో ఏజెంట్లుగా చేరనివ్వకుండా అధికార తెలుగుదేశం పార్టీలు నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కొందరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కానీ చాలామంది మా ప్రాణాలు పోయినా జగన్ వెన్నంటే ఉంటామని, బూత్‌ల్లో ఏజెంట్లు చేరతామని చెప్తున్నారు. వీరిలో వైసీపీ నేత అల్లం సత్యం కూడా జగన్ తో ఉంటామని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు సత్యం కారును కక్ష పూరితంగా దహనం చేశారట..
అలాగే గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో ఆదివారం వైసీపీ నేతలు, కార్యకర్తలు “రావాలి జగన్ – కావాలి జగన్” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలోని మండపాల సెంటర్ నుంచి వైసీపీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్తుండగా అక్కడే ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారు. కారణం లేకుండా కేవలం అక్కసు, అధికార అండతో దాడికి పాల్పడ్డారు. దీంతో అందరూ భయంతో పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. దాడితో పార్టీ కార్యకర్తలు జాన్‌బాషా, సుభాని, హుస్సేన్‌లకు గాయాలయ్యాయి..
గత నాలుగేళ్ల టీడీపీ పాలనలో ఈ తరహా ఘటనలు కొత్తవేవీ కాదు. మరోవైపు చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అలాగే వైసీపీ కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. చెవిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారని, చెవిరెడ్డిని భౌతికంగా అంతమొందించడానికి కూడా కుట్రలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రి అంతా పోలీసు వ్యాన్‌లో తిప్పుతూ సత్యవేడు పోలీస్‌స్టేషన్‌లో పెట్టడం చాలా దారుణమనే వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఉన్మాదచర్యలకు పాల్పడుతున్నారని, ఘటనను ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాలన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని పార్టీ నేతలు ధ్వజమెత్తారు.