టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మహర్షి తో బిజీగా ఉన్నారు.వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం.ఈ చిత్రం అనంతరం మహేష్ దర్శకుడు సుకుమార్‌తో ఓ సినిమా ఉంది.కాని ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది.స్టోరీ నచ్చకపోవడంతో తమ సినిమా క్యాన్సిల్ అయినట్లు స్యయంగా మహేష్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చెప్పారు.అయితే తాను సుకుమార్‌తో చేసిన 1 నేనొక్కిడినే సినిమా క్లాసికల్ హిట్ గా నిలిచిందని,సుకుమార్ తీయబోయే నెక్స్ట్ సినిమాకు ఆల్ ది బెస్ట్ సర్ అంటూ ట్విట్ చేసానని చెప్పాడు.
వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా క్యాన్సిల్ అవ్వడంతో మహేష్ అభిమానులు తీవ్ర అంసతృప్తిలో ఉన్నారు.ఈ చిత్రం ఆగిపోవడంతో సుకుమార్ బన్నితో సినిమాకు రెడీ అవుతున్నాడు.బన్ని ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు.ఇది పూర్తికాగానే సుకుమార్‌తో బన్ని చేస్తాడు.