టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం మహర్షి.ఇది మహేష్ కి 25వ సినిమా కావడంతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రం విడుదల వచ్చే నెల 25న ఉంటుందని ఓ ప్రకటన విడుదలైన విషయం అందరికి తెలిసిందే.కాని ఇప్పుడు సినిమాకు డేట్ మారిందట.
మే 9న విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది.ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు ఓ ప్రెస్ మీట్ లో ప్రకటిస్తారు.ఇది కేవలం నిర్మాత దిల్ రాజే నిర్వహిస్తారు. ఎందుకంటే ఏప్రియల్ 25న విడుదల అని చెప్పారు కాబట్టి, మళ్లీ డేట్ మారిందని చెబితే బాగోదని,అసలు డేట్ ఎందుకు మారింది,షూటింగ్ ప్రోగ్రెస్ ఏమిటి అనేది చెబుతారు.ఈ చిత్రం షూటింగ్ 16 వరకు వుంటుందని తెలుస్తుంది.దీనికితోడు ఏప్రియల్ లో సినిమాలు ఎక్కువగా ఉండడంతో 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానుంది.
