ఆంధ్రప్రదేశ్ లో ఎండలవేడితో సైతం పోటిపడుతున్న రాజకీయాల గురించి మనందరికీ తెలిసిందే. ప్రతీ నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్టు అంచనాకు రాలేకపోతున్నారు. అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం అన్ని నియోజకవర్గాల కన్నా భిన్నంగా వైసీపీ నుంచి పోటి చేస్తున్న మల్లాది విష్ణు పై బెట్టింగ్ రాయుళ్ళు గెలుపు గుర్రంగా భావించి లక్షలు కాస్తున్నారు. భారీగా పందాలు వేస్తున్నారు. ఆయనకు వచ్చే మెజారిటీ పైనే బెట్టింగ్ రాయుళ్ళు లక్షల్లో వేస్తున్నారు. ఆయన గతంలో ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు చేసిన మంచి పనులు నియోజకవర్గంలో సామన్యుడుగా ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిగా గొడవలకు దూరంగా ఉండటం అలాగే ప్రజలకు నిరంతరం దగ్గరగా ఉండటం ఈయనకు కలిసొచ్చే అంశాలుగా కనిపిపస్తున్నాయి. నియోజకవర్గంలో బోండా రౌడీయిజం, భూకబ్జాలు, అనుచరుల ఆగడాలు నాలుగైదు రోజుల క్రితం కూడా భ్రాహ్మణ సామాజికవర్గం డాక్టర్ గారిని దుర్భాషలడటం ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం విష్ణు గెలుపుకి బలమైన అంశాలుగా కలిసొచ్చాయి. ఈ లెక్కలన్నింటిని జూదారులు బేరీజు వేసుకొని ఈసారి ఎలాగైనా సెంట్రల్లో మల్లాది గెలుపు ఖాయమని జూదారులు లక్షల్లో, కోట్లల్లో బెట్టింగ్ వేయటం విశేషం. ఎందుకు మల్లాది గెలుపుపై అందరూ అంచాలు వేస్తున్నారో సమాధానం కావాలంటే మే 23వరకు ఆగాల్సిందే.
