మీకు ప్రస్తుత రోజుల్లో కాఫీ త్రాగే అలవాటు లేకపోతే మీరు ఎంత నష్టపోతారో ఇప్పుడు తెలుసుకొండి. కాఫీ త్రాగిన తర్వాత కలిగే లాభాలేంటో తెలుసుకున్నాక అయిన ఒక్కసారైన కాఫీ త్రాగాలని మీరు అనుకుంటారు. అయితే కాఫీ త్రాగడం వలన లాభాలు ఏమిటి అంటే..ఒక కప్పు కాఫీలో 1.8గ్రాముల ఫైబర్ ఉంటుంది. మన శరీరానికి రోజుకు అవసరమైన 20-40గ్రాముల్లో మనం రోజుకు రెండు సార్లు కాఫీ త్రాగితే 10%ఫైబర్ అందుతుంది. మందు త్రాగితే కాలేయం పాడవుతుంది. కానీ కాఫీ త్రాగితే అదే కాలేయానికి రక్షణవుతుంది. ఈ విషయాన్ని పలు పరిశోధనలూ తేల్చి చెప్పాయి..
ఇప్పుడు ప్రతి ఒక్కరినీ పట్టి పీడిస్తున్నమధుమేహ సమస్య నుంచి కాఫీ కాస్త ఉపశమనం పొందేలా చేస్తుంది. ఇందులోని ప్రత్యేక గుణాలు షుగర్ స్థాయిని తగ్గిస్తాయి. వ్యాధి లేని వారికి రాకుండా చూస్తాయి. మతిమరుపు తీవ్రమైన వచ్చే అల్జీమర్స్ వ్యాధిని రాకుండా అడ్డుకుంటుంది. కప్పు కాఫీ రోస్టెడ్ కాఫీలోని ప్రత్యేక గుణాలే దీనికి ప్రధాన కారణం.. కాఫీ త్రాగే అలవాటున్న ఎనబై ఆరు వేల మంది మహిళా నర్సుల్లో పది సం.లల్లో ఆత్మహత్య భావనలు తగ్గిపోయాయని ఓ అధ్యయనం వెల్లడించింది.అంతేకాకుండా కాఫీ త్రాగేవారు తక్కువ ఒత్తిడిలో ఉన్నట్లు కూడా వెల్లడైంది.
రోజూ కాఫీ త్రాగితే పార్కిసన్స్ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. అంతే కాకుండా జన్యు పర సమస్యలను కొంతమేర అడ్డుకుంటుంది. రోజు కాఫీ త్రాగేవారితో మిగతావారితో పోలిస్తే కాఫీ త్రాగేవారికి గుండె సమస్యలు తక్కువగా వస్తాయి.కాఫీ త్రాగేవారి డీఎన్ఎ క్రమంగా ధృఢంగా మారినట్లుగా యూరోపియన్ పరిశోధకులు తెలిపారు. కాఫీ త్రాగేవారి రక్తకణాలు దెబ్బతినే స్థాయి మిగతావారితో చాలా తక్కువ. మెదడు ,వెన్నుముక,నరాల పనితీరును క్రమంగా దెబ్బతీసి అత్యంత ప్రమాదకర స్లెరోసిస్ ను కాఫీ నియంత్రిస్తుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ.. పురుషుల్లో గౌట్ వ్యాధి వచ్చే అవకాశాలను క్యాన్సర్ చాలా వరకు తగ్గిస్తుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. బ్లాక్ కాఫీ త్రాగేవారికి దంతక్షయం వచ్చే అవకాశాలు తక్కువ.చురుకుతనం తీసుకురావడమే కాకుండా మెలనోమా తీవ్రతను తగ్గిస్తుంది.కండరాల నొప్పిని నలబై ఎనిమిది శాతం తగ్గిస్తుంది