బిగ్ బాస్ సీజన్ 3కి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ రియాలిటీ షోకి ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది.మన తెలుగులో అయితే మొదటిసారిగా 2017లో స్టార్ట్ చేసారు.దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో ఈ షో సూపర్ హిట్ అయ్యింది.అనంతరం సీజన్ 2 నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా 2018లో మీ ముందుకు వచ్చింది బిగ్ బాస్.రెండు సీజన్లు మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఫాన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఇక ఇప్పుడు మూడో సీజన్ కోసం ఇటు హోస్ట్‌తో పాటు అటు కంటెస్టెంట్స్‌ను వెతికే పనిలో పడ్డారు స్టార్ మా సంస్థ.మొదటి రెండు సీజన్లు హోస్ట్‌గా ఎన్టీఆర్, నాని ఉండడంతో ఇప్పుడు వాళ్ళు ఆశక్తి చూపడంలేదు..
అయితే విజయ్ దేవరకొండ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, రానా ఇలా చాలా పేర్లు లిస్ట్ లో ఉన్నాయని తెలుస్తుంది. వీరిలో బిగ్ బాస్ హోస్ట్ గా ఎవరు చేస్తారన్నది తెలియాలంటే వేచి ఉండాల్సిందే. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఫేమస్ సెలబ్రిటీలను రంగంలోకి దించుతున్నారని సమాచారం. సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి, టీవీ నటి హరిత, వరుణ్ సందేశ్, హేమ చంద్ర, యాంకర్ ఉదయభాను, హీరో కమల్ రాజు, రేణు దేశాయ్, గుత్తా జ్వాల, మనోజ్ నందన్, జబర్దస్త్ పొట్టి రమేష్, కొరియోగ్రాఫర్ రఘు, బిత్తిర సత్తి, కామన్‌మెన్, కామన్ ఉమెన్ అంటూ ఉన్న వీరు ప్రస్తుతం లిస్టు లో ఉన్నారు.