మే 23న ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో తేలిపోనుంది. అయితే అధికార టీడీపీ కంటే వైసీపీ అధికారం మాదంటే మాదేనని బలంగా చెప్తున్నారు. వైసీపీ ఇందుకు తగ్గ ప్రణాళికలను కూడా రూపొందించుకుంటుంది. ఫలితాలు వచ్చాక వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో చూస్తే వైసీపీ ఎంత ఆపార్టీ అధికారం పట్ల స్పష్టంగా ఉందో అర్దమవుతుంది. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరలవుతోంది. విజయనగరం జిల్లా పార్వతీపురం శ్రీవిద్యా సర్వమంగళాదేవీ పీఠానికి చెందిన జ్యోతిష్యులు మురపారక కాళిదాసు శర్మ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ముహుర్తం ఖరారు చేసారు. జగనే సీఎం అవుతారని ఆయన నమ్మకంగా చెబుతున్నారు.
మే 26 ఉదయం 9.29 గంటలకు దివ్యమైన ఘడియలు ఉన్నాయని.. ఆ సమయంలో జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తే తిరుగుండదని అంటున్నారు. జగన్ జన్మనక్షత్రం రోహిణి కాబట్టి, వైసీపీ ఆవిర్భావ దినం ఆరుద్ర నక్షత్రాల కలయికతో అద్భుతమైన ముహర్తం ఉందని శర్మ చెబుతున్నారు. గతంలో తెలంగాణలో కేసీఆర్, టీఆర్ఎస్ గెలుస్తారని తానే ముందు చెప్పానన్నారు. దేవనాడీ కాలచక్ర గ్రహగ్రతుల్ని అనుసరించి కచ్చితమైన జ్యోతిష్యం చెప్పామని తెలిపారు. అందుకే ఇప్పుడు ఏపీలో కూడా జగనే గెలుస్తారని చెప్తున్నారు. ముఖ్యంగా ఆరోజే ప్రమాణ స్వీకారం చేస్తే ఏపీకి, జగన్ కు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ఎంతో మంచిదని చెప్తున్నారు.