నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం గత నెల ఏప్రిల్ 5న విడుదలైన విషయం అందరికి తెలిసిందే.నిన్ను కోరి చిత్రంతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని చక్కగా నడిపించాడు.ఈ చిత్రంలో నాగచైతన్యకు లవర్ గా నటించిన దివ్యాంశ కౌశిక్..మజిలీనే తనకి తెలుగులో మొదటి చిత్రం కాగా అంతకముందు ఈ హీరోయిన్ ఫెయిర్ అండ్ లవ్ లీ, హీరో హోండా బైక్ వాణిజ్య ప్రకటనల్లో చేసింది.ఈ చిత్రంలో లవ్ అండ్ లైఫ్ కోసం మంచిగా చూపించాడు డైరెక్టర్ శివ.ఇది ఈరోజుకి 28రోజులు పూర్తి చేసుకుంది.ప్రస్తుతం బాక్సాఫీస్ లో మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి.ఇప్పటిదాకా ఈ చిత్రం అక్షరాల 68.05కోట్లు రాబట్టింది.
