ఐపీఎల్ 2019లో నేరుగా ప్లే ఆఫ్ కు చేరే అవకాశాన్ని హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కోల్పోయింది. నిన్న శనివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోవడంతో ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే ఈ రోజు ఆదివారం ముంబై,కోల్ కత్తా ఓడిపోతే మాత్రం మెరుగైన రన్ రేట్ ఆధారంగా హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరే అవకాశముంది. అయితే మొత్తంగా చూస్తే చేతిలో ఉన్న అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయి హైదరాబాద్ ఈ రోజు జరగనున్న కోల్ కత్తా మ్యాచ్ పై ఆధారపడాల్సి వచ్చింది.
