ఓ యువకుడు జగన్ పై ఉన్న అభిమానాన్ని చూపించడానికి తన పెళ్లి ఎన్నికల ఫలితాల రోజున పెట్టుకున్నాడు.23తేదీన జగన్ గెలవబోతున్నాడు,ఆరోజు నేను పెళ్లి చేసుకుంటే జీవితాంతం గుర్తుంటుందని అన్నాడు.గుంటూరు జిల్లాకు చెందిన రామకోటయ్యకు,మాదల గ్రామానికి చెందిన వేనీలతో ఈ నెల 23న పెళ్లి నిశ్చయించారు.ఇదే రోజున ఎన్నికల ఫలితాలు ఉండడంతో పెళ్లి మండపంలో అందరు ఫలితాలు చూసేలా టీవీలను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించాడు.ఇదే విషయాన్ని తన బంధువులకు శుభలేఖలు ఇస్తూ ప్రత్యేకంగా ఈ విషయాన్నీ తెలియజేస్తున్నారు.అందరూ పెళ్ళికి రండి..టీవీలు ఏర్పాటు చేసాను ఎన్నికల ఫలితాలు అక్కడే చూడొచ్చు అని చెప్పాడు.
