ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థుల హావా కొనసాగుతుంది. ఉదయం మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి నుండి వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు వైసీపీ 101చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతుంది. అధికార పార్టీ టీడీపీ మాత్రం కేవలం ఐదు చోట్ల మాత్రమే ముందంజలో ఉంది..
