తెలంగాణ రాష్ట్ర సర్కారు రైతన్నలకు శుభవార్తను తెలిపింది. రాష్ట్రంలో గత కొంతకాలంగా ఉన్న ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయి ఉన్న కొత్త పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియ త్వరలోనే తిరిగి మొదలు కానున్నది. అయితే రాష్ట్ర వ్యాప్తమ్గా మొత్తం 58లక్షల పాసుపుస్తకాలకు గాను ఇప్పటివరకు మొత్తం 55.6లక్షల పాసుపుస్తకాలను రెవిన్యూ శాఖ జిల్లాలకు పంపిణీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నది రెవిన్యూ శాఖ.
