వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగే షాకిచ్చారు. గతంలో పలుమార్లు ట్వీట్లతో బాబు అండ్ బ్యాచ్ పై విమర్శల వర్షం కురిపించారు. ఏకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీతో బాబుకు ముచ్చెమటలు పట్టించారు. తాజాగా ఆయన బస్తీమేసవాల్ అంటూ మరోసారి చంద్రబాబుకు సవాల్ విసిరారు.ఈ క్రమంలో తన అధికారక ట్విట్టర్ ఖాతాలో”ఎక్కడయితే Ex Cm నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుండి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో NTR circle దగ్గర ఎల్లుండి ఆదివారం సాయంత్రం 4గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను. బస్తీమే సవాల్!!! ఎన్టీఆర్ నిజమైన అభిమానులకు ఇదే నా బహిరంగ ఆహ్వానం .. జై జగన్ “అంటూ ట్వీటు చేశాడు.
