దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన సతీమణి లక్ష్మీపార్వతి మంగళవారం ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె టీడీపీ పార్టీ మరియు నాయకుడు చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేసారు.పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ జయంతి వేడుకలకు కనీస భాద్యత కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు.జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేయపోవడం,కనీసం ఆయన ఘాట్ ను అలంకరించాపోవడం పై టీడీపీ పార్టీ,నాయకులపై మండిపడ్డారు.నేను పార్టీకి ఇప్పుడు వ్యతిరేకత కాదని,ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పైనే అని చెప్పారు.బాబు చేసిన అన్యాయాలు,అక్రమాలుకు తగిన శాస్తి జరిగిందని.ఏపీ ప్రజలు సరైన బుద్ధి చెప్పారని ఆమె అన్నారు.టీడీపీ ప్రభుత్వం చేసిన మోసాలు,అప్పులు అన్ని కూడా ప్రస్తుత సీఎం వైసీపీ అధినేత జగన్ సరి చేస్తాడని చెప్పుకొచ్చారు.
